Tuesday, April 29, 2008

సరైన దశ రానిదే ఏదీ జరుగదు

జీవితంలో మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, ఏదో సాధించాలని. కాని కొన్ని జరుగుతాయి కొన్ని జరుగవు. అనుకున్నవి జరుగలేదని ప్రయత్నం ఆపడం కార్యశూరుల లక్షణం కాడు. నిరాశ సహజమే, కాని ప్రయత్నం లేనిదే ఏదైనా ఎలా సిద్ధిస్తుంది?

జాతకం లో సరైన దశ రానంతవరకూ ఏదీ జరుగదనేది నిజం.ఇది అనుభవం మీదనే తెలుస్తుంది.కొందరు జాతకాన్ని అతిగా నమ్మి ఎట్టి పనీ చెయ్యకుండా ఊరకే వుంటారు.
ఇది కూడా తప్పే మరి. పురుష ప్రయత్నం లేనివారికి దైవం కూడా సహాయం చెయ్యలేదు.కనీసం నోట్లో పెట్టిన ఆహారాన్ని నమిలి మింగాలన్నా ప్రయత్నం కావాలిగా.