Saturday, June 7, 2008

జీవన గమ్యం

సామాన్యమైన మనిషి జీవితానికి గమ్యం ఉండవచ్చు, లేక ఉండక పోవచ్చు. డబ్బు సంపాదించడమే నేటి గమ్యం కావచ్చు. కాని ఆలోచనాపరుడైన వానికి జీవిత గమ్యం ఒక్కటే ఉండాలి. అది మరణ రహస్యం తెలుసుకోవడమే. చాలామంది అనుకునేతట్లు దేవుణ్ణి చేరడం మనిషి గమ్యం కాదు. దేవుదేవరో మనకు తెలియదు. కాని మరణం మన కళ్ళ ముందు కనిపించే నిజం. మనిషి ఎందుకు పుడుతునాడు, ఎందుకు చస్తున్నాడు,తరువాత ఎక్కడికి పోతున్నాడు. ఈ ప్రశ్నలకు జవాబులు మనిషి కనుక్కోవాలి. పుస్తకాల నుంచో లేక మత గురువుల నుంచో కాదు. తన అన్వేషణ నుంచే. మనిషి చేస్తున్న పెద్ద తప్పు, మరణాన్ని తేలికగా తీసుకోవడమే.

1 comment:

chakri said...

మీరన్నది నిజమే , నాకు అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు ..